కేదార్ నాథ్, బద్రీనాథ్ వెళ్లే మార్గంలో ప్రతికూల వాతావరణం నెలకొనడంతో ముందు జాగ్రత్త చర్యగా చార్ధామ్ యాత్రను నిలిపివేశారు. సోమవారం ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఈ ఆదేశాలు జారీ చేశారు. గత వారం రోజులుగా మంచు, వర్షం కురవడంతో కొండచరియలు విరిగిపడిపోయాయి. దీని కారణంగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలో వాతావరణం అనుకూలించిన తర్వాత తమ యాత్రను కొనసాగించవలసిందిగా సీఎం విజ్ఞప్తి చేశారు.