స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లైఫ్ వారి ఆధ్వర్యంలో ఉద్యోగ అవకాశాలకు దరఖాస్తులు కోరుచున్నట్లు డెవలప్మెంట్ మేనేజర్, ఎం. దిలీప్ రాజా మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెనాలి డివిజన్ పరిధిలోని ఎస్. బి. ఐ, లైఫ్ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ పార్ట్, ఫుల్ టైం ఉద్యోగాలకు నియామకాలు జరుగుతాయన్నారు. 21 సంవత్సరాల నుండి 45 సంవత్సరాలు వయస్సు గల అభ్యర్థులు పిజి,యమ్ టెక్,బి టెక్, యమ్.ఫార్మా, బి.ఫార్మా,, డిగ్రీ,ఇంటర్,10 వ తరగతి, అర్హతలు కలిగి ఉండాలన్నారు. ఉత్కర్ష స్కీం ద్వారా పర్మినెంట్ ఉద్యోగం, లాంగ్ టైం రెగ్యులర్ గ్రాడ్యుయేషన్ అలవెన్స్లు ఉంటాయన్నారు. ఎస్. బి. ఐ లైఫ్ వారి ఏజెన్సీ నియామకాలలో ఎటువంటి పెట్టుబడి అవసరం లేకుండా ప్రముఖ బ్యాంకింగ్ రంగ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ లో నియామకాలు జరుగుతాయన్నారు.ఆసక్తి కలిగిన యువతీ యువకులు మరిన్ని వివరాల కొరకు 8639066501 నెంబర్ ద్వారా సంప్రదించాలని దిలీప్ రాజా కోరారు.