‘మహానాడు’లో అధినేత నారా చంద్రబాబునాయుడు ప్రకటించిన తొలి మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు టీడీపీ నేతలు ‘భవిష్యత్తుకు గ్యారంటీ’ పేరుతో గత వారం ప్రారంభించిన బస్సు యాత్ర మంగళవారం అనకాపల్లి జిల్లా నుంచి విశాఖ జిల్లాలో ప్రవేశించనున్నది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ..... తొలి మేనిఫెస్టోను ప్రజలు స్వాగతిస్తున్నారని, అందుకు అనకాపల్లి జిల్లాలో బస్సు యాత్రకు లభించిన అపూర్వ స్పందనే నిదర్శనమని పేర్కొన్నారు. మంగళవారం గాజువాక నియోజకవర్గంలో ఈ బస్సు యాత్ర జరుగుతుందన్నారు. అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రాన్ని కాపాడడం ఒక్క చంద్రబాబునాయుడు వల్లే సాధ్యమవుతుందన్నారు. ఈ సమావేశంలో పార్టీ గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్, కార్పొరేటర్ పల్లా శ్రీనివాసరావు, నాయకులు పుచ్చా విజయ్‌కుమార్, పులి వెంకటరమణారెడ్డి, రతన్‌కాంత్, అనంత్, వాసు, గాంధీ, తదితరులు పాల్గొన్నారు.