రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని అఖిలపక్షం నాయకులు ఆధ్వర్యంలో మంగళవారం ఎమ్మిగనూరు పట్టణంలో విద్యుత్ శాఖ ఏడికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా అఖిలపక్షం నాయకులు పంపన్నగౌడ్, హనుమంతులు, మాట్లాడుతూ పెంచిన విద్యుత్ ఛార్జీల వల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని విమర్శించారు. అలాగే వైకాపా ప్రభుత్వం రాబోయే ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోతుంద న్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజు రామాంజనేయులు కాశీం తదితరులు పాల్గొన్నారు.