క్రిప్టోకరెన్సీల్లో పెట్టుబడులపై టాటా గ్రూప్ గౌరవ చైర్మన్, వ్యాపారవేత్త రతన్ టాటా వివరణ ఇచ్చారు. క్రిప్టోకరెన్సీతో తనకు ఏ రూపంలోనూ సంబంధం లేదని వెల్లడించాడు. నేను క్రిప్టోకరెన్సీలో పెట్టుబడి పెట్టినట్లు మీకు ఏవైనా వార్తలు వస్తే, నమ్మవద్దు. అవి అస్సలు నిజం కాదు. ప్రజలను మోసం చేసేందుకు ఇలాంటి కథనాలు వస్తున్నాయని రతన్ టాటా పేర్కొన్నారు.