జనాభా విషయంలో చైనాను దాటేసిన ఇండియా తాజాగా మరో విషయంలో ఆ దేశాన్ని అధిగమించింది. గత తొమ్మిదేళ్లలో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనుల్లో భాగంగా దేశ రోడ్ నెట్‌వర్క్ 59 శాతం వృద్ధి చెంది అమెరికా తర్వాత ప్రపంచంలోనే రెండవ అతి పెద్దదిగా అవతరించిందని కేంద్ర మంత్రి గడ్కరీ తెలిపారు. దేశంలో దాదాపు 64 లక్షల కిలోమీటర్ల రోడ్ నెట్‌వర్క్ ఉందని, ప్రస్తుతం 1,45,240 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులు పెరిగాయన్నారు.