జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి యాత్రకు రెండు రోజుల బ్రేక్ పడింది. జనసేనానికి జ్వరం రావడంతో యాత్రను రెండు రోజులపాటు నిలిపివేసినట్టు జనసేన వర్గాలు తెలిపాయి. దీంతో భీమవరంలోనే పవన్ విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే భీమవరంలో ఈనెల 30న జనసేన బహిరంగ సభ ఉంటుందని జనసేన వర్గాలు వెల్లడించాయి. తాజా టూర్లో పవన్ పలుసార్లు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.