వైకాపా పాలనలో ఎస్సీ, ఎస్టీ, బిసి, ముస్లిం, మైనారిటీలపై దాడులు పెరిగిపోయాయని వాటిని అరికట్టాలని, మహిళలకు రక్షణ లేదని టిడిపి బిసి సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి పవన్ కుమార్ గౌడ్ అన్నారు. దళితులపై దాడులను నిరసిస్తూ బుధవారం గుంతకల్లు పట్టణంలోని టిడిపి నాయకులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పాల్గొన్నారు.