చంద్రబాబు ఒకపక్క ఎస్సీలుగా ఎవరు పుట్టాలని కోరుకుంటారని మాట్లాడుతుంటే.. సీఎం వైయస్ జగన్ నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అని మాట్లాడుతున్నారు అని ఎంపీ నందిగం సురేష్ తెలియజేసారు. కుల వివక్ష ఎవరి దగ్గర ఉందో ప్రజలకు అర్థం అవుతుంది. చంద్రబాబును నమ్ముకున్న దళితుడు ఇవాళ ఫలానా స్థాయిలో ఉన్నాడని చెప్పగలరా..? ఈ రాష్ట్ర ప్రజలతో సహా సీఎం వైయస్ జగన్‌ను నమ్ముకొని మోసపోయిన ఓ వ్యక్తిని ఒకరిని చూపించగలరా..? అని ప్రశ్నించారు.