స్వార్థపూరితమైన ఆలోచనతో పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర చేస్తున్నారని మాజీ మంత్రి ఆళ్ల నాని మండిపడ్డారు. పవన్‌కు ఒక ఎజెండా లేదని, చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడమే ఆయన లక్ష్యమన్నారు. నరసాపురం సభలో పవన్ చేసిన వ్యాఖ్యలను ఆళ్లనాని తీవ్రంగా ఖండించారు. రాయలసీమ రౌడీలు, గుండాలంటూ పవన్ ప్రజల్లో భయానక పరిస్థితులు నెలకొల్పేలా వ్యాఖ్యలు చేస్తున్నారని తప్పుపట్టారు.