ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తమ పిల్లలను బడికి పంపించే తల్లులకు ఆర్థిక భరోసా కల్పిస్తూ రూపొందించి, అమలు చేస్తున్న అమ్మ ఒడి పథకం 4వ విడత నిధులను సీఎం జగన్ బుధవారం మధ్యాహ్నం బటన్ నొక్కి విడుదల చేయడం పాఠకులకు విదితమే. ఇదిలా ఉంటే అమ్మ ఒడి పథకం ద్వారా ఇప్పటికీ శృంగవరపుకోట నియోజకవర్గంలో గల పలువురు తల్లుల ఖాతాలకు డబ్బులు జమ అయ్యాయి. ఈ నేపథ్యంలో తమ బ్యాంకు ఖాతాలకు ఇప్పటివరకు అమ్మ ఒడి డబ్బులు జమ కాలేదంటూ పలువురు తల్లులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో గల ఆయా గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఇంకా అమ్మ ఒడి డబ్బులు తమ బ్యాంకు ఖాతాలకు జమ కాని కొంతమంది తల్లులు తమ గ్రామంలో అమ్మ ఒడి పథకానికి అర్హులైన వారిని అమ్మ ఒడి డబ్బులు వారికి పడ్డాయా? లేదా? అని ఆత్రుతగా వాకబు చేయడం స్పష్టంగా కనిపిస్తోంది.
ఈ నేపథ్యంలో అమ్మ ఒడి డబ్బులు గురించి వేయికళ్లతో ఎదురుచూస్తున్నామని శృంగవరపుకోట మండలంలో కొంతమంది విద్యార్థుల యొక్క తల్లులు అంటున్నారు. ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం అమ్మబడి నాలుగో విడత నిధులను విడుదల చేశారని, అమ్మ ఒడి పథకానికి అర్హులైన అందరి తల్లులకు మరో 10 రోజుల వరకు బ్యాంకు ఖాతాలో జమ అవుతాయని సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ తమ బ్యాంకు ఖాతాలో అమ్మ ఒడి డబ్బులు జమకాని కొంతమంది తల్లులు ఒకంత ఆందోళనలకు గురవుతున్నారు.