తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని విశాఖ దక్షిణ నియోజకవర్గం ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జి ఆధ్వర్యంలో గురువారం విశాఖపట్నంలో గల స్థానిక కాన్వెంట్ జంక్షన్ వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శృంగవరపుకోట మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు బండారు సత్యనారాయణమూర్తితో కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె చంద్రబాబు ఇటీవల ప్రకటించిన మినీ మేనిఫెస్టోలో గల హామీలను ప్రజలకు విపులంగా వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెదేపా కార్యనిర్వాహక కార్యదర్శి కోళ్ల బాలాజీ రాంప్రసాద్, మాజీ మంత్రులు, తెదేపా నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.