ఫిష్ ఆంధ్ర స్కీం లో భాగంగా 20 లక్షల యూనిట్ ధర విలువ కలిగిన రెండు వ్యానులను శృంగవరపుకోట శాసనసభ్యులు కడుబండి శ్రీనివాసరావు చేతుల మీదుగా గురువారం ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులైన శృంగవరపుకోట నియోజకవర్గం కొత్తవలస మండలం గులివిందాడ గ్రామానికి చెందిన చింతల అప్పారావు అలాగే లక్కవరపుకోట మండలం నిడిగట్టు గ్రామానికి చెందిన దుక్క అప్పలరాజుకు ఎమ్మెల్యే శ్రీనివాసరావు చేతుల మీదుగా వ్యాను తాళాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హులైన వారికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వివక్షత లేకుండా సంక్షేమ పథకాలను అందజేస్తున్నారని ఆయన కొనియాడారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కొప్పుల వెలమ కార్పొరేషన్ చైర్మన్ నెక్కల నాయుడు బాబు, పిఎసిఎస్ చైర్మన్ గొరపల్లి శివ, ఎల్ కోట ఎంపీపీ గేదెల శ్రీనివాసరావు, వేపాడ మండల పార్టీ అధ్యక్షులు మూమ్ములూరి జగన్నాథం, కొత్తవలస జేసిఎస్ ఇంచార్జ్ బొంతల వెంకటరావు, కొట్టాం సేనాపతి చందర్రావు, తూర్పాటి శివాజీ, గులివిందాడ గణేష్, చింతలపాలెం పల్లా భీష్మ, సంతపాలెం ఎంపిటిసి వెలగల రమణ, దేవాడ రమణ, అప్పన్న దొరపాలెం సర్పంచ్ రాములమ్మ, మల్లి వీడు వెంకటేష్, జగ్గన్న దొర, సోంబాబు, పెదబాబు, ఎస్. కోట తలారి అనంత, ఆతవ రమేష్, గొల్లలపాలెం రామనాయుడు, చీపురు వలస కృష్ణ, నారాయణమూర్తి మాస్టర్ తదితరులు పాల్గొన్నారు.