తక్కువ కులం అబ్బాయిని ప్రేమించిందనే కోపంలో ఓ తండ్రి తన కూతురి గొంతు కోసి చంపేశాడు. ఈ ఘటన కర్ణాటకలోని కోలార్ జిల్లా బంగారుపేటలో చోటు చేసుకుంది. గంగాధర్, కీర్తి రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే వీరి పెళ్లికి కీర్తి తండ్రి నిరాకరించాడు. పెళ్లి చేసుకోవద్దని ఎంత చెప్పినా కీర్తి వినకపోవడంతో కోపోద్రిక్తుడైన తండ్రి కత్తితో ఆమె గొంతు కోసి చంపేశాడు. ప్రియుడి ఫిర్యాదు మేరకు పోలీసులు తండ్రిని అదుపులోకి తీసుకున్నారు. అయితే కీర్తి మృతిని తట్టుకోలేక గంగాధర్ కూడా రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.