తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన పేదల మేనిపెస్టో ప్రజలను ఉన్నతమైన స్థాయిలో పెట్టేవిధంగా ఉందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, పెందుర్తి నియోజకవర్గం పరిశీలకులు గంటా నూకరాజు అన్నారు. గురువారం ఉదయం భీమిలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గంటా నూకరాజు, జనరల్ సెక్రటరీ గొలగాని నరేంద్రకుమార్ ఆధ్వర్యంలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడమైనది. ఈ సందర్బంగా గంటా నూకరాజు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మహానాడు వేదికగా ప్రవేశపెట్టిన మేనిపెస్టో ప్రతీ సామాన్యుడుకి ఉపయోగపడేదిగా ఉందని అన్నారు. ఈ మేనిపెస్టో ప్రతీ ఒక్కరికీ చేరాలనే ఉద్దేశ్యంతో భవిష్యత్ గ్యారంటీ. చైతన్య రధయాత్ర ( బస్సుయాత్ర ) రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు సూచనలు ప్రకారం చేపడుతున్నామని అన్నారు. ఈ బస్సుయాత్ర భీమిలి జోన్ 3వ వార్డులో శనివారం బోయవీధిలో ఏర్పాటు చేయబడునని ఆయన చెప్పారు. బస్సుయాత్ర బీచ్ రోడ్డులో ఎగువపేట, బోయవీధి, లైట్ హౌస్, పాత బస్టాండ్, గంటస్తంభం, నూకాలమ్మ గుడి, డైట్ మీదుగా చిన్న బజార్ వరకు ఈ యాత్ర సాగుతుందని అన్నారు. చంద్రబాబు నాయుడు ఎంతో ముందుచూపుతో ఆలోచించి మేధావుల యొక్క సలహాలు సూచనలు తీసుకొని ఈ మేనిపెస్టో ప్రవేశపెట్టారని అన్నారు.
ఎన్టీఆర్ శతజయంతి సందర్బంగా పేదల అభివృద్దే లక్ష్యంగా ప్రకటించిన పధకాలతో ప్రజల్లో నూతన ఉత్సాహం మొదలయిందని అన్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా తెలుగుదేశం పార్టీ విజయం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు. అందువలన బాబుగారు పెట్టిన పధకాలను ప్రజల ముందు ఉంచుటకు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో శనివారం జరుగు బస్సుయాత్రను విజయవంతం చేయాలని గంటా నూకరాజు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి గొలగాని నరేంద్రకుమార్, నాయకులు మారోజు సంజీవకుమార్, పెంటపల్లి యోగేశ్వర రావు కనకల అప్పలనాయుడు, సంకురుభుక్త జోగారావు, వాడమొదలు సత్యారావు, కొక్కిరి అప్పన్న, గండిబోయిన పోలిరాజు, రాజగిరి రమణ, అప్పికొండ నూకరాజు, నొల్లి రమణ, కంచెర్ల కామేష్, నెక్కెళ్ళ వెంకటరావు, కుప్పిల గురుమూర్తి, వియ్యపు పోతురాజు, వాడమొదలు రాంబాబు, కందుల సుందర్ రావు, శ్రీనివాసరావు, అప్పికొండ నర్సింగరావు, సురేంద్ర, జరజాపు పాపారావు, లక్ష్మణరావు, వాసుపల్లి వంశీ, పీతల వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.