కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రెండో రోజు మణిపూర్ లో పర్యటిస్తున్నారు. మోయిరాంగ్ పట్టణంలోని శిబిరాల్లో తలదాచుకుంటున్న బాధితులను రాహుల్ గాంధీ కలిసారు. వారి బాధలు వింటూ, వారి పిల్లలతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా కొంతమంది వృద్ధులు రాహుల్ గాంధీని ఆలింగనం చేసుకొని కన్నీరు పెట్టుకున్నారు. కాగా, మణిపూర్ లో జరుగుతున్న హింస కారణంగా ఇప్పటివరకు 100 మంది మృతిచెందిన విషయం తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa