ఏపీలో నేటి నుండి పింఛన్లు పంపిణీ చేయనున్నారు. వాలంటీర్లు లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పింఛను డబ్బులను అందజేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 62,99,376 మంది వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, చేతివృత్తిదారులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారి పింఛన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 1,735.96 కోట్లను విడుదల చేసింది.