ఆధార్- పాన్ అనుసంధానానికి గడువు నేటితో ముగియనున్న నేపథ్యంలో ఆదాయపన్ను శాఖ కీలక ప్రకటన చేసింది. ఆధార్- పాన్ లింక్ చేసిన తర్వాత కొంతమంది చలాన్ డౌన్ లోడ్ చేసుకోవడంలో ఇబ్బంది ఎదుర్కొంటున్నారని, చలాన్ చెల్లింపులు చేసిన తర్వాత ఐటీ వెబ్ సైట్ లో లాగిన్ చేసి ఈ-పే ట్యాక్స్ సెక్షన్ లో పేమెంట్ పూర్తయిందా లేదా తెలుసుకోవచ్చని తెలిపింది. ఆధార్ లింక్ కోసం చలాన్ డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదని తెలిపింది.