హిమాలయాల్లోని మంచు శివలింగాన్ని దర్శించుకునేందుకు సాగే అమరనాథ్ యాత్ర ప్రారంభమైంది. జమ్మూలోని భాగవతి నగర్ క్యాంపు నుంచి 3,400 మంది యాత్రికులతో కూడిన మొదటి బృందం యాత్రను జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ జెండా ఊపి ప్రారంభించారు. 62 రోజులపాటు కొనసాగే ఈ యాత్ర అనంతనాగ్ జిల్లాలోని 48 కి.మీ పొడవైన నునవాన్-పహల్గామ్ మార్గంతో పాటు గందేర్బల్ జిల్లాలోని 14 కి.మీ పొడవైన బల్తల్ మార్గంలోనూ సాగుతుంది.