ఇంటర్నెట్ వినియోగదారుల్లో ఏపీ తొలి స్థానంలో నిలిచింది. 202-23కు గానూ రాష్ట్రంలో ప్రతి వంద మంది జనాభాకు 120.33 సబ్ స్క్రిప్షన్లు ఉన్నాయని ఓ నివేదిక వెల్లడించింది. గత నాలుగేళ్లలో ఏపీలో ఇంటర్నెట్ వినియోగం భారీగా పెరిగినట్లు తెలిపింది. ఏపీ తర్వాత కేరళలో అత్యధికంగా ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్నారు. కేరళలో సగటున 87.50 సబ్ స్క్రిప్షన్లు ఉండగా, దేశవ్యాప్తంగా 59.97 ఉన్నాయని నివేదిక పేర్కొంది.