మహరాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నాసిక్ జిల్లాలోని సపుతర హైవేపై ఖోరీ ఫాటా సమీపంలో మారుతి సియాజ్ కారు, ప్యాసింజర్ క్రూయిజర్ వాహనం ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో సియాజ్ కారులోని నలుగురు వ్యక్తులు స్పాట్ లోనే మృతిచెందారు. మరో 9 మంది గాయపడ్డారు. మృతులను వినాయక్ గోవింద్ క్షీరసాగర్(37), యోగేష్ దిలీప్ వాగ్(18), జతిన్ అనిల్ పావ్డే(23), రవీంద్ర మోతీచంద్ చవాన్(22)గా గుర్తించారు.