అధికార వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. కృష్ణా జిల్లా వైసీపీ ప్రధాన కార్యదర్శి సుభాష్ చంద్రబోస్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. తన అనుచరులు, మద్దతుదారులతో కలిసి చంద్రబాబు సమక్షంలో టీడీపీ పుచ్చుకున్నారు. మంగళగిరిలోని టీడీపీ ఆఫీస్ లో చంద్రబాబు సుభాష్ కు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. సుభాష్ తో పాటు మాజీ సర్పంచ్ లు, మాజీ ఎంపీటీసీలు పెద్ద సంఖ్యలో టీడీపీలో చేరారు.