ప్రపంచంలోని అత్యంత పురాతన వార్తా పత్రికల్లో ఒకటైన ‘వీనర్ జైటుంగ్’ గొంతు మూగబోయింది. దాని రోజువారీ ముద్రణ నిలిపేస్తున్నట్లు 3 శతాబ్దాలకు పైగా చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన ఈ పత్రిక చివరి సంచికను శుక్రవారం ముద్రించారు. ‘వీనర్ డయేరియం’ పేరుతో 1703, ఆగస్ట్ 8న ఈ పత్రిక ప్రారంభం కాగా, తర్వాత దాని పేరు ‘వీనర్ జైటుంగ్’గా మారింది. ఆదాయం పడిపోవడంతో ముద్రణ నిలిపేశారు. ఆన్ లైన్ ఎడిషన్ కొనసాగుతుందని యాజమాన్యం వెల్లడించింది.