నెల్లూరులో వైద్య విద్యార్థిని సూసైడ్ చేసుకుంది. శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన చైతన్య(23) అనే వైద్య విద్యార్థిని చింతారెడ్డిపాలెం వద్ద ఉన్న నారాయణ మెడికల్ కళాశాల హాస్టల్లో ఉంటూ హౌస్ సర్జన్ చేస్తోంది. ఈరోజు ఉదయం కాలేజీ హాస్టల్ గదిలో చైతన్య బలవన్మరణానికి పాల్పడింది. వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించి..కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చైతన్యకు 2 నెలల క్రితమే వివాహం జరిగింది.