నేరేడు పండ్లు తింటే చాలా కాలంగా కడుపులో పేరుకుపోయిన మలినాలను తొలగిపోతాయి. కానీ వీటిని సరైన కాంబినేషన్‌తో తినకపోతే ఆరోగ్యానికి హాని చేస్తుందని నిపుణులు అంటున్నారు. నేరేడు పండ్లు తిన్న వెంటనే నీళ్లు తాగితే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. డయేరియా, అజీర్ణం వంటి సమస్యలు రావొచ్చు. నేరేడు పండ్లు తిన్న తర్వాత 30 నుంచి 40 నిమిషాల తర్వాత మాత్రమే నీళ్లు తాగడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.