పలాస, కాశీబుగ్గ మున్సిపాలిటిలో టీడీపీ నేత నాగరాజు ఇంటి ముందు ఉన్న కల్వర్టు కూల్చివేయటం దుర్మార్గమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.... మంత్రి సీదిరి అప్పలరాజు అక్రమాలను నిరంతరం ఎండగడుతున్నందుకే నియోజకవర్గంలో టీడీపీ నేతలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని, పైగా అక్కడకు వెళ్లిన టీడీపీ నేతల్ని అరెస్ట్ చేస్తారా? అంటూ మండిపడ్డారు.