నకిలీ వరి విత్తనాలు విక్రయిస్తే చర్యలు తప్పవని కొత్తవలస ఏడిఏ విజయ హెచ్చరించారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ ఆదేశాల మేరకు గంట్యాడ మండలంలోని పలు గ్రామాల్లో గల ఏడు ఎరువులు షాపులను ఏడిఏ విజయ శనివారం సాయంత్రం ఆకస్మిక తనిఖీ చేశారు. అదేవిధంగా వరి విత్తనాలను అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. అదేవిధంగా రికార్డులను పరిశీలించారు కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి శ్యాం కుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.