వన్డే ప్రపంచకప్ 2023కి శ్రీలంక జట్టు క్వాలిఫై అయింది. ఆదివారం క్వాలిఫయర్ టోర్నీలో భాగంగా జింబాబ్వేతో జరిగిన సూపర్-6 మ్యాచ్‌లో గెలుపొంది శ్రీలంక ప్రపంచకప్‌కు అర్హత సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 32.2 ఓవర్లలో 165 పరుగులకు ఆలౌటైంది. తర్వాత బరిలోకి దిగిన శ్రీలంక కేవలం 33.1 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa