విజయనగరం జిల్లా పెద్దఆసుపత్రి సర్వజన ఆసుపత్రిగా మారిన తర్వాత వైద్య సేవలు మరింత విస్తరించాయని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శంబంగి అప్పలనాయుడు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిగా మారిన తర్వాత విభాగాలు కూడా విస్తృతమయ్యాయన్నారు. వైద్య సిబ్బంది కూడా అవసరం మేరకు ప్రభుత్వం నియమించిందని, వైద్య సిబ్బంది మరియు ఆస్పత్రి సిబ్బంది రోగులకు మెరుగైన సేవలు అందిస్తున్నారన్నారు.ఓపి, ఐపి, ఆపరేషన్లు పెరిగాయిఅన్నారు.