జిల్లాలో జగనన్నకు చెబుదాం కార్యక్రమం పగడ్బందీగా నిర్వహిస్తున్నామని విజయనగరం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఆదివారం కలెక్టరేట్లో తమ ఛాంబర్ లో తెలిపారు.ఆమె మాట్లాడుతూ వచ్చిన ప్రతి దరఖాస్తును పరిశీలించి అర్జీదారులందరినీ శత శాతం సంతృప్తిపరిచేలా చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించామన్నారు.వచ్చిన వినుతులపై ప్రతివారం సమీక్షిస్తున్నామని అసంతృప్తి వ్యక్తం చేసిన అర్జీదారుల దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించామన్నారు. అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయికి వెళ్లి అర్జీ దారులతో మాట్లాడి నిర్దేశిత గడువులోగా వారిని సంతృప్తి పరిచేందుకు కృషి చేస్తున్నామని అన్నారు.