జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురుపౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. వేద జ్ఞానాన్ని మానవాళికి అందించిన వేద వ్యాసుడు మూల గురువుగా భావించి ఆయన జన్మించిన వ్యాసపూర్ణిమను గురు పూర్ణిమగా జరుపుకొనే ఈ వేడుకకు భారతీయ సమాజంలో విశిష్ట స్థానం ఉందన్న సంగతి సర్వవిదితమే అని తఅన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో తల్లిదండ్రుల తరువాత విశిష్ట స్థానాన్ని అందుకునేవారు గురువులే అని చెప్పుకొచ్చారు. గురుతహా సముపార్జించిన జ్ఞానం సుసంపన్నమైనదని.. సుస్థిరమైనదని పేర్కొన్నారు. అందువల్లే 'గురు బ్రహ్మ' అంటూ భగవంతునిగా గురువును ఆరాధిస్తామని అన్నారు. తెలుగు వారంతా ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో విలసిల్లాలని మనసారా కోరుకుంటున్నానట్లు పవన్ కళ్యాణ్ వెల్లడించారు.