విశాఖ ఏజెన్సీ ప్రాంతంనుంచి కాకినాడకు గంజాయి అక్రమ రవాణా చేస్తూ విక్రయిస్తున్న నలుగురు యువకులను, నలుగురు బాలురు (బాలనేరస్తులు)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరినుంచి 23.200 కిలోల గంజాయి, రవాణాకు వినియోగిస్తున్న బైక్‌ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాకినాడ జిల్లా పోలీసు కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్పీ సతీష్‌కుమార్ వివరాలు వెల్లడించారు. కాకినాడ అర్బన్ ఎస్.అచ్చుతాపురం అంబేడ్కర్‌కాలనీకి చెందిన 23ఏళ్ల పిట్టా రాజు (పిట్ట) ఏటిమొగ మధ్యపేటకు చెందిన 20ఏళ్ల కాలాడి లక్ష్మణ్‌వర్మ, రాగంపేట మూ డుగుళ్లువీధికి చెందిన 20ఏళ్ల జీరి శ్రీనివాసరెడ్డి, అన్నమ్మఘాటీ రెడ్డివీధికి చెందిన 19ఏళ్ల బవినిశెట్టి ప్రవీణ్‌కుమార్, వీరితోపాటు మరో నలుగురు బాలురు పలుచోట్ల మోటార్‌బైక్‌లను చోరీచేసి వీటిని ఏజెన్సీ ప్రాంతంలో విక్రయించగా వచ్చిన డబ్బుల తో గంజాయి కొనుగోలు చేస్తున్నారు. ఆ సరుకు కాకినాడకు తీసుకువచ్చి ఇక్కడ విక్రయించడం, సేవించడం చేస్తున్నారు. ఎస్పీ ఆదేశాల మేరకు ఏఎస్పీ పి.శ్రీనివాస్, కాకినాడ ఎస్‌ఈబీ అదనపు ఎస్పీ ప్రేమకాజల్, ఇన్‌చార్జి డీఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు నేతృత్వంలో సర్పవరం ఎస్‌హెచ్‌వో ఆకుల మురళీకృష్ణ తన సిబ్బందితో ఈ యువకు లను, బాలురను కాకినాడరూరల్ మండలం వలసపాకలలో ఉండగా దాడిచేసి పట్టు కున్నారు. ఈ సందర్భంగా నిందితులనుంచి 23.200 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు.గంజాయి అక్రమ రవాణాకు వినియోగిస్తున్న బైక్‌ని స్వా ధీనం చేసుకున్నామన్నారు. సర్పవరం పోలీస్‌స్టేషన్‌లో నార్కోటిక్స్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్సటాన్సస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. వీరిలో నలుగురు బాలనేరస్తులు కావడంతో జువైనల్ హోమ్‌కు తరలించేందుకు జువైనల్ జస్టిస్ బోర్డు, రాజమహేంద్రవరంలో హాజరుపరచగా 15రోజుల రిమాండ్ విధించారని తెలిపారు. గంజాయి పట్టివేతలో ప్రత్యేక కృషి చేసిన సర్పవరం ఎస్‌హెచ్‌వో ఆకుల మురళీకృష్ణ, సిబ్బందిని ప్రత్యేకంగా ఎస్పీ అభినందించారు.