పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు పాత భవనంలోనే ప్రారంభమవుతాయని కేంద్ర సహాయ మంత్రి మీనాక్షి లేఖి సోమవారం తెలిపారు.పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 20న ప్రారంభమవుతాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి శనివారం ప్రకటించారు. ఆగస్టు 11 వరకు సమావేశాలు కొనసాగుతాయని ఆయన తెలిపారు. మే 28న కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సమావేశానికి ప్రభుత్వం ముఖ్యమైన శాసనసభ ఎజెండాను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ప్రతిపక్షాలు కూడా అనేక సమస్యలపై ప్రభుత్వంపై నిలదీసేందుకు సిద్ధమవుతున్నాయి.