తెనాలి పట్టణం లో సోమవారం అర్ధరాత్రి నుంచి భారీగా వర్షాలు పడుతున్నాయి. సోమవారం ఉదయం నుంచి ఎండగా ఉండి సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయి ఉన్నటుండి ఉరుములు, మెరపులతో మొదలైన వర్షం రాత్రంతా పడింది. ఈ వర్షానికి చేరువులు, కుంటలు, పొలాలు నీటితో నిండిపోయాయి. విద్యార్థులకు పరిక్షలు ఉండడంతో వర్షంలోనే వెళ్తున్నారు. రాత్రి నుంచి విద్యుత్ సరఫరా లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa