ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని స్థానిక తూర్పు వీధిలో సోమవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇంటింటికి తిరుగుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరించారు. దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో సంక్షేమ పథకాలు చేరువ చేసిన ఘనత ముఖ్యమంత్రికే దక్కుతుందని ఎమ్మెల్యే అన్నారు