మహారాష్ట్రలో మంగళవారం ఘోర ప్రమాదం సంభవించింది. ధూలే జిల్లా షిర్పూర్ తాలూకాలోని ముంబై-ఆగ్రా హైవేపై ఓ కంటైనర్ లారీ అదుపు తప్పింది. పలు వాహనాలను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు చనిపోయారు. 28 మందికి పైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అందాల్సి ఉంది.