గుంటూరులో సీబీఐ విచారణకు తాము హాజరు కాలేమని మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఆర్థిక అక్రమాల కేసులో ఏ1 చెరుకూరి రామోజీరావు, ఏ2 శైలజా కిరణ్ చెప్పినట్లు తెలుస్తోంది. అనారోగ్య కారణాల వల్ల రామోజీరావు, ఇతర కారణాల వల్ల శైలజ కిరణ్ విచారణకు హాజరుకాలేమని ఈ-మెయిల్ ద్వారా సీఐడీ అధికారులకు సమాచారం ఇచ్చారు. బ్యాంక్ నిబంధనలకు విరుద్ధంగా అక్రమ డిపాజిట్ల సేకరణ కేసులో ఈ నెల 5న విచారణకు హాజరుకావాలని గతంలో అధికారులు నోటీసులు జారీ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa