ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ముందుస్తు ఎన్నికల ఆలోచన ఏ మాత్రం లేదు: మిథున్ రెడ్డి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 05, 2023, 09:26 PM

ఏపీలో ముందస్తు ఎన్నికలంటే గత కొన్ని నెలలుగా  చర్చ సాగుతున్న తరుణంలో తమకు ముందస్తు ఆలోచన లేదని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి బుధవారం స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన నేపథ్యంలో మీడియా ప్రతినిధులు ముందస్తు గురించి ప్రశ్నించారు. ఈ సందర్భంగా మిథున్ రెడ్డి మాట్లాడుతూ... ఒక్కరోజు కూడా తాము ముందస్తుకు వెళ్లేది లేదన్నారు. రాష్ట్ర అభివృద్ధి, నిధులకోసమే సీఎం జగన్ కేంద్ర పెద్దలతో చర్చించారన్నారు.


జగన్ తన ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తదితరులతో భేటీ అయ్యారు. అమిత్ షాతో భేటీ సందర్భంగా ముందస్తు చర్చకు వచ్చినట్లుగా మీడియాలో కథనాలు వచ్చాయి. కేంద్రం ముందస్తుపై ఆలోచన చేస్తోందని, ఈ క్రమంలో తమకు దగ్గరగా ఉన్న పార్టీలతో ఈ అంశాలపై చర్చలు జరుపుతోందని ప్రచారం సాగుతోంది. ఇందులో భాగంగా జగన్ తోను ఏపీలో ముందస్తుపై చర్చలు జరిపి ఉంటుందనే ప్రచారం సాగింది. అయితే ఈ ప్రచారాన్ని ఎంపీ మిథున్ రెడ్డి కొట్టిపారేశారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa