నిరుపేదలకు వ్యవసాయ భూములు పంచేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల్లో అర్హులైన 47 వేల మందికి 54 వేల ఎకరాలను పంచనుంది. ఒక్కో లబ్ధిదారునికి ఎకరం నుండి 1.5 ఎకరాల భూమి ఇవ్వనుంది. ఈ నెల 12న జరగనున్న మంత్రివర్గ భేటీలో భూపంపిణీకి ఆమోదముద్ర వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో అత్యధికంగా వైఎస్సార్ జిల్లాలో 8,916 ఎకరాలు, సత్యసాయి జిల్లాలో 7,676 ఎకరాలు పంపిణీ చేయనున్నారు.