ప్రముఖ స్వచ్ఛంద సేవా సంస్థ అసిస్ట్, సీడ్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో చిలకలూరిపేట పట్టణంలోని సుభాని నగర్లో గురువారం ఒంటరి నిరుపేద మహిళలైన 250 మందికి 5 లక్షల విలువైన నిత్యావసరాలను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా అసిస్ట్ డైరెక్టర్ జాష్టి రంగారావు మాట్లాడుతూ ఒంటరి పేద మహిళలు ఇబ్బందులు పడకూడదనే ఉద్ధేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని పేర్కొన్నారు.