దోమలు వృద్ధి చెందకుండా ప్రతి ఒక్కరూ చర్యలు తీసుకోవాలని కామనూరు ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ హనీఫ్ బాబ సూచించారు. ప్రొద్దుటూరు మండలంలోని చౌడూరు గ్రామంలో డెంగీ నివారణ మాసోత్సవం సందర్భంగా గురువారం ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సూపర్ వైజర్ బి. ఏ. వరప్రసాద్, ఎఫ్ పీసీ పర్యవేక్షకడు చంద్రశేఖర్, సీహెచ్ఓ నాగలత, ఆరోగ్యకార్యకర్త వేదవతి, ఆశ కార్యకర్తలు, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.