కర్ణాటక సీఎం సిద్ధరామయ్య శుక్రవారం రూ.3,27,747 కోట్ల రాష్ట్ర బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఇందులో రూ.2,50,933 కోట్లు ఆదాయ వ్యయానికి, రూ.54,374 కోట్లు మూలధన వ్యయానికి, రూ.22,441 కోట్లు రుణాల చెల్లింపునకు కేటాయించారు. ఎన్నికల్లో తాము ఇచ్చిన 5 హామీలు కోటి కంటే ఎక్కువ కుటుంబాలకు రూ.52,000 కోట్లను బదిలీ చేస్తాయని సీఎం వెల్లడించారు. మహిళా ఆధారిత పథకాలకు రూ.70,427 కోట్ల గ్రాంట్ కేటాయించారు.