శుక్రవారం కర్ణాటక అసెంబ్లీ బడ్జెట్ సెషన్ సందర్భంగా 70 ఏళ్ల అపరిచితుడు ప్రవేశించాడు. ఖాళీ ఉన్న ఎమ్మెల్యే సీటులో దర్జాగా కూర్చున్నారు. అయితే పక్కనే ఉన్న జేడీఎస్ ఎమ్మెల్యే ఆయనను గమనించి భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేశారు. దీంతో వారు అతన్ని బయటకు తీసుకెళ్లి పోలీసులకు అప్పగించారు. వృద్ధుడు చిత్రదుర్గ జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. తాను ఎమ్మెల్యేనని చెప్పుకుంటూ అసెంబ్లీలోకి ప్రవేశించినట్లు పోలీసులు తెలిపారు.