దేవదాయ, ధర్మాదాయ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రూ.5లక్షల లోపు ఆదాయం ఉన్న ఆలయాలను దేవదాయ శాఖ పరిధి నుంచి తప్పించింది. ఈ మేరకు శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సత్యనారాయణ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం దేవదాయ శాఖ దాదాపు 33వేల ఆలయాలను పర్యవేక్షిస్తోంది. వీటిలోనుంచి రూ.5లక్షల లోపు ఆదాయం ఉన్నవాటిని తొలగిస్తే శాఖకు కేవలం 1,400 ఆలయాలే మిగలనున్నాయి.