వైయస్ మహానేత అని, పేద ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారని జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. శనివారం ఈ మేరకు వైయస్సార్ విగ్రహానికి అలాగే శ్రీకాకుళం పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కిల్లి కృపారాణి, అందవరపు సూరిబాబు, ఎన్ని ధనంజయరావు, డాక్టర్ దానేటి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.