ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైసీపీ దుర్మార్గాలు ఇంకా సాగనీయం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 08, 2023, 12:14 PM

పల్నాడు జిల్లా, అమరావతి మండలం ధరణికోటలో టీడీపీ కార్యకర్త సంజయ్‌పై వైసీపీ కార్యకర్తలు దాడి చేసారంటూ, దానిని మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్  తీవ్రంగా ఖండించారు. శుక్రవారం ఎమ్మెల్యే మీడియాతో మాట్లడుతూ.. ధరణికోటలో అర్ధరాత్రి సోషల్ మీడియా కార్యకర్తపై దాడికి పాల్పడడం, వైసీపీ నేతల పిరికిపంద చర్య అని అన్నారు. జగన్ లాగానే.. ఆయన కార్యకర్తలు తయారయ్యారని మండిపడ్డారు. దౌర్జన్యం.. దుర్మార్గం వైసీపీకి పేటెంట్ హక్కుగా మారిపోయాయన్నారు. వైసీపీ తప్పులను సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే.. దాడులకు తెగబడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో చట్టం కూడా వైసీపీకి చుట్టంగా మారిపోయిందన్నారు. బాధితులకు అండగా ఉండాల్సిన పోలీసులు.. వైసీపీ నేతలకు దాసోహం అంటున్నారని మండిపడ్డారు. ఇక ఎన్నాళ్లో వైసీపీ దుర్మార్గాలు సాగవని.. అక్రమ దాడులకు పాల్పడ్డ ప్రతి ఒక్కరికి గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. కార్యకర్తలను తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కంటికి రెప్పలా కాపాడుకుంటుందని కొమ్మాలపాటి శ్రీధర్ పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com