నిన్న (శుక్రవారం) తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ విషయం తెలిసిందే. ఎమ్మెల్యే కేతిరెడ్డి ఏడాదిన్నర చీనీ తోటకు పంట భీమా డబ్బులు కొట్టేశారని ఆరోపిస్తూ జేసీ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. పంటల భీమాలో రైతులకు న్యాయం జరగలేదని.. వైసీపీ నాయకులకే న్యాయం జరిగిందన్నారు. క్రాప్ ఇన్సూరెన్స్ రూపంలో 13.89 లక్షల రూపాయలు ఎమ్మెల్యే పెద్దారెడ్డి కొట్టేశారని ఆరోపించారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చీనీ తోటకు వస్తానని.... దమ్ముంటే ఆపండి అంటూ సవాల్ విసిరారు. చీనీ తోటలో పంట లేకుండానే... ఎమ్మెల్యే పెద్దారెడ్డి పంట బీమా సొమ్ము కొట్టేశారని ఆరోపించారు. ఏడాది వయస్సున్న చీనీ చెట్లకు పంట నష్టం భీమా ఎలా వచ్చిందో అధికారులు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే పెద్దారెడ్డికి ఇన్సూరెన్స్ డబ్బులు ఎలా వచ్చాయో.. వచ్చే సోమవారం స్పందనలో ఫిర్యాదు చేస్తానని తెలిపారు. ‘‘ఎమ్మెల్యే పెద్దారెడ్డి పాడె ఎత్తే... నేను పోతా.... థూ నీ బతుకు చెడ’’ అంటూ ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై జేసీ ప్రభాకర్ రెడ్డి నిప్పులుకక్కారు.