దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి తెలుగు ప్రజల్లో గుండెల్లో ఎప్పటికీ పదిలంగా ఉంటారని, ఆయన్ను ప్రజలు ఎన్నటికీ మర్చిపోరని వైయస్ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మహానేత వైయస్ఆర్ మరణించినా ఆయన పాలన ఆగలేదని, వైయస్ఆర్ ఆశయాలకు అనుగుణంగా ఆయన తనయుడు సీఎం వైయస్ జగన్ పరిపాలన సాగిస్తున్నారన్నారు. సీఎం వైయస్ జగన్ రూపంలో వైయస్ఆర్ ఉన్నారన్నారు. వైయస్ఆర్ ఆత్మశాంతి కలిగేలా సీఎం వైయస్ జగన్ పేరు ప్రఖ్యాతలు సంపాదించారని, ఈతరం యువత సీఎం వైయస్ జగన్ తండ్రి వైయస్ఆర్ అని గర్వంగా చెప్పుకునేలా పరిపాలన చేస్తున్నారన్నారు.