ఆనాడు వేసిన పునాదులపై ఎప్పటికీ చెరిగిపోనటువంటి స్థిరమయినటువంటి నిర్మాణాలను ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి చేస్తున్నారని మంత్రి ధర్మాన ప్రసాద్ రావు తెలిపారు. ఈ సందర్భంగా యన మాట్లాడుతూ... ఇది ఈ రాష్ట్రం భవిష్యత్తులో దేశంలోనే ప్రథమ స్థాయిలో నిలబడుతుందని నేను నమ్ముతూ ఉన్నాను. ఎప్పుడయినా జగన్మోహన్ రెడ్డి గారి నమ్మకం కచ్చితంగా రుజువు అవుతుంది. సమాజాన్ని ట్రాన్స్ ఫార్మ్ చేయడానికి ప్రధానమయిన ఆయుధం విద్య. ఆ విద్యను చాలా అకుంఠితమయిన దీక్షతో ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో అన్ని వర్గాలకు అందించి ఒక విశాలమయిన దృక్పథంతో ఒక భావజాలంతో అతను పనిచేస్తున్నారు. తప్పక ముందు తరాలు అతన్ని శ్లాఘిస్తాయని,అతని నాయకత్వాన్ని ఎప్పుడు కూడా బలపరుస్తాయని,చిరకాలం అతను ప్రజల హృదయాల్లో నిలిచిపోతారని నేను నమ్ముతున్నాను అని అయన తెలిపారు.