నారా లోకేశ్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యువగళం పాదయాత్ర విజయవంతంగా 150 రోజులకు చేరుకుంది. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో లోకేశ్ పాదయాత్ర కొనసాగుతోంది. నేడు నెల్లూరు జిల్లా, అల్లూరుకు లోకేష్ చేరుకున్నారు. శ్రీ పోలేరమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమంలో యువనేత పాల్గొన్నారు. కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటాయని.. విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచేశారని, సామాన్యులు బ్రతికే పరిస్థితి లేదంటూ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే తమపై భారం తగ్గించాలంటూ లోకేష్‌ను వ్యాపారస్తులు కోరారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ముందు పెట్రోల్, డీజిల్‌పై పన్ను తగ్గిస్తామని.. దాని ప్రభావం అన్ని రంగాల మీద ఉంటుందని లోకేష్ హామీ ఇచ్చారు.